15-10-2025 06:39:42 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం బాన్సువాడకు చెందిన వ్యాపారవేత్త రుద్రంగి మురళి తన కూతురు శ్రీవల్లి పుట్టిన రోజు సందర్భంగా పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన ప్లేట్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం అని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు రుద్రంగి మురళి దంపతులకు శాలువతో సన్మానించడం జరిగింది.