అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
08-03-2026 11:23 AM
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని ముఖ్యమంత్రి అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.




