calender_icon.png 6 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఖరితోనే సాయి ఆత్మహత్య

06-12-2025 12:53:05 AM

-తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ

-హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద నిరసన 

ముషీరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ వైఖరి కారణంగానే సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్నాడని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆరోపించారు. సాయి ఈశ్వర్‌చారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్ నగర్ వై జంక్షన్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాల వైఖరిపై పోరాటం చేయాలని, సాయి ఈశ్వర్ చా రి మృతికి కారణమైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి నిరసన వ్య క్తం చేశారు.

ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. తక్షణమే స్థానిక సంస్థ ల ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రితో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల కోసం ఎంతమంది బీసీలు బలిదానాలు చేసుకుంటే ఇస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మోహన్, శ్రీకాంత్,  నరేష్, వంశీ, అర్జున్,  వినోద్ తదితరులు పాల్గొన్నారు.