14-01-2026 09:27:54 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధిష్టానం ప్రకటించడంతో, పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు రాసురి హరిక్రిష్ణ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మండల నాయకులు సిర్ర సాయి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు నుండి పోటీలో ఉంటానని బుధవారం తెలిపారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను, సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. ఈ మేరకు జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.