17 April, 2026 | 2:16 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

ఈటూరు మదర్ డెయిరీ చైర్మన్ గా సైదులు ఏకగ్రీవం

07-06-2025 09:08 PM

నాగారం: నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్(MLA Mandula Samuel), ఆశీర్వాదంతో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ చింతారెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారంతో మదర్ డెయిరీ చైర్మన్ గా బూర్గుల ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. శనివారం మదర్ డైయిరీ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

నూతన ఛైర్మెన్ గా ఎన్నికైన బూర్గుల సైదులు మాట్లాడుతూ... నా ఎన్నికకు సహకరించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్, చింతారెడ్డి రాజాగోపాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లుగా కొమ్ము సునీత, వంగూరి సంజీవ, తీగుళ్ళ యాదగిరి, బుంగ ఇమ్మి, కొమ్ము లింగుస్వామి, కన్నెబొయిన రాములు, గుండు సతయ్య, కన్నెబొయిన మహేష్,  కొరివి ఉపేందర్ లు ఎన్నికయ్యారు.ఈకార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పేరాల పూలమ్మ, మాజీ ఉపసర్పంచ్ పేరాల వెంకన్న, మాజీ చెర్మెన్ తీగుళ్ళ వెంకన్న, వంగూరి నాగార్జున, కన్నెబొయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు.