1 September, 2026 | 3:38 PM

రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య పరిమితి పెంచాలి

01-09-2026 03:05 PM

ముకరంపుర, సెప్టెంబర్1(విజయక్రాంతి): ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య పరిమితి 10లక్షల పెంచాలని టీఎన్జీవో(TNGO)ల కేంద్ర సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం ఏ హమీద్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పేదవారి వైద్యానికి "చేయూత" రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Aarogyasri) పథకంలో రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం పథకం ప్రారంభించి నందులకు సంతోషం వ్యక్తం చేశారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్త ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రవేశ పెట్టిన "కొత్త ఆరోగ్య కార్డుల పథకం"(New Health Card Scheme)లో భాగంగ నెల నెల జీతాల నుండి పెన్షన్ల నుండి 1.50 శాతం సహాయం తీసుకొని రూ.3లక్షల రూపాయల వరకు పరిమితి విధించడం చాల విడ్డూరంగా ఉందన్నారు.

కావున ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి 10లక్షల రూపాయల వరకు వైద్యం అందించాలని కోరారు. ఔట్ పేషంట్ సదుపాయం కేవలం వెల్నెస్ సెంటర్లకే పరిమతి విధించకుండా అధికారికంగా ఎంపిక చేయబడిన ప్రతి హాస్పిటల్ నందు ఔట్ పేషెంట్ విధానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు కూడా ఉద్యోగ ఆరోగ్య కార్డులను అధిక శాతం హాస్పిటల్స్ గుర్తించడం లేదని కావున ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కార్డులు అమలు అయ్యే విధంగా చూడాలని కోరారు.