4 August, 2026 | 1:22 PM

Breaking News

ఒకటో తారీకున వేతనం చెల్లింపు

04-08-2026 12:05 PM

అయ్యవార్ల కళ్ళల్లో ఆనందం 

మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో దీప దూప నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న అర్చకులకు మొట్టమొదటిసారిగా ఈనెల 1వ తేదీన వేతనాలను చెల్లించడంతో అయ్యవార్లు అమితానంద పడుతున్నారు. ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న అర్చకులకు 2007 ప్రారంభం అయిన నాటి నుండి 2026 జూలై వరకు మొట్టమొదటి సారిగా ఆగస్టు 1 వ తేదీన జీతాలు విడుదల అవడంతో డిడియన్ అర్చకులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ డిడియన్ అర్చకుల సంఘం గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, గౌరవ సలహాదారు లక్ష్మీనరసింహాచార్యులు జిల్లా అధ్యక్షులు (రాష్ట్ర కన్వీనర్) చక్రధరాచార్యులు, వేంకటేశ్వరాచార్యులు, వేణుగోపాల్ , రమణ శర్మ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమీషనర్ హనుమంతరావుకు అనేకానేక మంగళాశాసనములు తెలిపినారు.

అదేవిధంగా వీరితో చర్చించి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు విడుదల అయ్యేలా చేసిన డిడియన్ రాష్ట్ర అధ్యక్షులు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ, అమరేశ్వర్ శర్మ, హరికిషన్ కు ధన్యవాదాలు తెలిపినారు. ఇదే విధంగా డిడియన్ పరిధిలోని దేవాలయాలను గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ గా గుర్తింపు ఇచ్చి దేవాదాయ శాఖ లో విలీనం చేసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.