18 April, 2026 | 5:30 PM

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

18-04-2026 04:02 PM

తహసీల్దార్ శ్రీకాంత్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి):  రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి, మద్దతు ధర పొందాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ సూచించారు.శనివారం మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాశం కరుణాభాస్కర్ రెడ్డి, ఏపీఎం రాంబాబుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘబంధం మండల అధ్యక్షురాలు బొడ్డు స్వప్న, ఉపసర్పంచ్ కోటమర్తి మేనకావెంకట్, జీపీఓ సంతోష్ రెడ్డి, సీసీలు యాదగిరి, నాగార్జున, కేంద్రాల నిర్వాహకులు పిట్టల రాంబాబు, రమేష్, స్వప్న, సుజాత, రైతులు తదితరులు పాల్గొన్నారు.