మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
చిన్న ముప్పారంలో రైతుల నిరసన
మహబూబాబాద్,(విజయక్రాంతి): పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తాము పండించి తెచ్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఆశతో కొనుగోలు కేంద్రం వద్ద రాశులు పోసామని, ఇప్పుడు తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా ఇతర గ్రామాల్లో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిన్నముప్పారం గ్రామంలో 2,250 ఎకరాలు భూమిలో మొక్కజొన్న సాగు చేశామని, మహబూబాబాద్ జిల్లాలో అతిపెద్ద కొనుగోలు కేంద్రంగా ఉన్నటువంటి సెంటర్ కు అనుమతి రాకపోవడంతో నిరాశకు గురి చేసిందన్నారు.
మొక్కజొన్న పంట దిగుబడులను నెల రోజుల కింద నుండి కళ్ళంలో పోసుకొని కొనుగోళ్ల కోసం చూస్తుండగా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రన్ని ఏర్పాటు చేయకపోవడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయిలి భవాని శేఖర్, ఉపసర్పంచ్ మల్లం ఐలయ్య, వార్డు సభ్యులు, రైతులు కట్ల అనిల్, ఆది చందు, కారుపోతుల సుమన్, చిన్నాల కట్టమల్లు, కామినేని బాలరాజు, గుండు వేణు, ఆది చందర్ రావు, కాలేరు శ్రీనివాస్, శాల్వ వెంకటేష్, నర్రా చంద్రయ్య, జక్కుల లింగయ్య, నర్ర సునీల్, కట్ల అయిలు,బానోత్ సుమన్,రాములు వెంకన్న, శ్రీను,మహిళా రైతులు,హైమ, సాలమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.






