15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉప్పు అవసరమే కానీ..

20-04-2025 12:00 AM

మనం రోజూ తినే ఆహార పదార్థాలు, కూరలు, ఇతర వంటకాలు రుచిగా ఉండాలంటే వాటిలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు పరిమాణం వాటిలో ఎక్కువైనా, తక్కువైనా వంటకం రుచి పాడవుతుంది. సరిపడినంత ఉప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం..

పరిమితికి మించి ఉప్పు తీసుకుంటే అంతకంటే ఎక్కువ అనర్థాలు ఉన్నాయి. అందుకే ఉప్పును అవసరాన్ని బట్టి రుచికోసం పరిమితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు మన నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల సంకోచం, వ్యాకోచం చెందేందుకు ఉప్పు అవసరమే. ఉప్పులోని అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు మేలు చేస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు తగ్గితే లోబీపీ వచ్చి రక్తప్రసరణ తగ్గిపోతుంది. అందు కే ఉప్పును తగిన పరిమాణం లో తీసుకోవాలి. అదే ఉప్పు ను ఎక్కువగా తీసుకుంటే హై బీపీ సమస్య పెరగడంతో పాటు కిడ్నీలపై భారం పెరిగి కిడ్నీల ఫెయిల్యూర్‌కు కారణ మయ్యే అవకాశం ఉంది.