18-11-2025 12:05:18 AM
బెల్లంపల్లి, నవంబర్ 17 : బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి దేవస్థానంలో చివరి కార్తీక సోమవారం భక్తులు ఘనమైన మొక్కలు చెల్లించుకున్నారు. మందమర్రి కి చెందిన మెరుగు గణేష్ స్రవంతి దంపతులు రూ 1,21,615 విలువగల 753 గ్రాముల వెండి నాగాభరణం, త్రినేత్రాలను స్వామివారికి బహుకరించారు. అర్చకులు కూరెళ్ళ సతీష్ శర్మ ప్రత్యేక పూజల మధ్య వెండి నాగాభరణాన్ని శివలింగానికి అలంకరించారు.
బెల్లంపల్లి శ్రీ సాయి హనుమాన్ భజన మండలి సభ్యులు భజన కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భారీగా తరలివచ్చిన భక్తులకు తాండూర్ మండలం బోయపల్లి గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మీనారాయణ గౌడ్ సరిత దంపతులు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్, అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కన్నాల మాజీ సర్పంచ్ జిల్లా పల్లి స్వరూప, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.