calender_icon.png 18 November, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత రాజకీయాల్లోకి రావాలి

18-11-2025 12:03:22 AM

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

- కరీంనగర్ లో సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి

కరీంనగర్, నవంబరు 17 (విజయ క్రాంతి): సర్దార్ వల్లభాయి పటేల్ ఆశయాలను నెరవేర్చేందుకు నేటి యువత రాజకీ యాల్లోకి రావాలని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి ఉత్సవాల సందర్భం గా సోమవారం కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల నుండి నిర్వహించిన పాదయాత్ర లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, యువ త హాజరై సంజయ్ తోపాటు నడిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి ఏ మాత్రం మంచి పరిణామం కాదన్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర వ్యతిరేకమన్నా రు. ప్రపంచంలో నెలకొన్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లను భారత్ అధిగమించాలంటే తప్పనిసరిగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

భారత దేశ ఐ క్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసి న మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్ అని, దేశంలోని 560 సం స్థానాలను ఒకే జెండా కిందకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడని కొనియాడారు. పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని, తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని లేదా ముస్లిం దేశంగా మార్చాలని ఆనాడు నిజాం రాజు కుట్రలు చేసిండని, ఒకవేళ తెలంగాణ భారత్ లో విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించాలన్నారు.

మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేదన్నారు. ఇది ఆనాడే గ్రహించిన పటేల్ తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్య్ర రాజ్యంగా ఉంటే భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని ప్రకటించి ’‘ఆపరేషన్ పోలో” తో నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడన్నారు. దేశంలో ఆధునిక సివిల్ సర్వీసెస్ వ్యవస్థను స్థాపించడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

క్రమశిక్షణ, నిష్ఠ, ధైర్యం, పరిపాలనా దీక్షత ఆయనకున్న ప్రధాన లక్షణాలని కొనియాడారు. అలాంటి మహనీ యుడిని 150 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా, ఆయన సిద్దాంతాలను కొనసాగించాలనే మహత్తర ఆశ యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు “సర్దార్@150 ఐక్యతా మార్చ్‌” పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మ ల్క కొమరయ్య, అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, తదితరులుపాల్గొన్నారు