2 March, 2026 | 1:42 PM

స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం

02-03-2026 11:24 AM

ముంబై: స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(Sensex down) వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ(NIFTY 50) 300 పాయింట్లకుపైగా నష్టాల్లో పడిపోయింది. స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం పడిందని విశ్లేషకులు తెలిపారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్(US, Israel attack Iran) యుద్ధంతో దేశీయ మార్కెట్ కుప్పకూలిందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

సోమవారం అమెరికా డాలర్‌తో(US Dollar) పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు తగ్గి 91.29కి చేరుకుంది. ముడి చమురు ధరలు పెరగడం, బలమైన అమెరికన్ కరెన్సీ, పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అస్థిరత నెలకొన్నాయి. ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్(Equity Market Sentiment) ప్రతికూలంగా ఉండటం, విదేశీ నిధులను భారీగా ఉపసంహరించుకోవడంతో భారత కరెన్సీపై(Indian currency) ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకంలో రూపాయి 91.23 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ఒప్పందాలలో గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 91.29కి మరింత క్షీణించింది. దాని మునుపటి ముగింపు స్థాయి నుండి 21 పైసలు తగ్గింది.