2 March, 2026 | 12:11 PM

ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ మరో ప్రకటన

02-03-2026 11:00 AM

వాషింగ్టన్: ఇరాన్ పై అమెరికా(Iran-US war) బాంబుల మోత మోగిస్తోంది. ఇరాన్ పై బీ2 బాంబులను వదిలింది. 2 వేల కిలోల బాంబులను అమెరికా జారవిడిచింది. ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయన్నారు. ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్(Iranian Navy Headquarters) ను కూడా ధ్వంసం చేశామని చెప్పారు.

మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్ నౌకాదళం(Iranian Navy) మొత్తం నాశనమైందని ప్రకటించారు. దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారని ట్రంప్ వెల్లడించారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని సూచించారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇరాన్ తో చర్చలకు సిద్ధమన్న ట్రంప్  చర్చల కోసం ఇరాన్ ముందే రావాల్సిందన్నారు.