17 April, 2026 | 11:23 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ముప్పయేళ్ల కలకు మోక్షం..!

16-06-2025 12:33 AM
  1. వేములవాడలో రోడ్ల విస్తరణకు శ్రీకారం
  2. మటన్ మార్కెట్ ను కూల్చివేసిన అధికారులు 
  3. స్వచ్ఛందంగా తొలగించుకుంటున్న కొందరు 
  4. -  70 మంది నిర్వాసితులకు పరిహారం అందజేత 
  5. కూల్చివేతలు ప్రారంభం.. 144 సెక్షన్ అమలు 

రాజన్న సిరిసిల్ల: జూన్ 15 (విజయక్రాంతి ): సుమారు ముప్పు ఏళ్ల కల.. ఏళ్ల తరబడి నిరీక్షణ వెరసి వేములవాడ ప్రధాన రహదారి రోడ్ల విస్తరణ పనులకీ మోక్షం లభించింది. వేములవాడ మూలవాగు నుండి రాజన్న ఆలయం వరకు రహదారి విస్తరణకు ఆదివారం ముహూర్తం ఖరారు చేశారు.ముందుగా మున్సిపల్, రాజన్న ఆలయానికి సంబంధించిన దుకాణాలను కూల్చి వేశారు.

భూ నిర్వసితులకు రూ. 47 కోట్లు మంజూరు కాగా 250 మంది భూ నిర్వాసితులకు గాను 70 మంది చెక్కులు తీసుకున్నారు. ఇండ్లు,దుకాణాలు ఖాళీ చేయాలని గత 15 రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసిన గడువు ముగియగానే ముందుగా మున్సిపల్,ఆలయ దుకాణాలు కూల్చి వేశారు.మిగతా ఇండ్లు,దుకాణాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది.

మున్సిపల్ సిబ్బంది దుకాణాలు ఖాళీ చేయాలని దుకాణదారులకు సమాచారం చేరవేయడంతో కొంత మంది నిర్వాసితులు స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. గడువులోపు ఖాళీ చేయనిదుకాణదారులపైజిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది.

కూల్చివేత కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్,జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ వారంలో కూల్చివేత ప్రక్రియను.పూర్తిచేయనున్నట్లు అధికారులు చెప్పడంగమనార్హం.