తర్వాతి సినిమా హాలీవుడ్‌లో..!
సమంత లీడ్ రోల్‌లో రాజ్ అండ్ డీకే నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అప్పుడే రాజ్ నిడిమోరు, సమంత తర్వాతి ప్రాజెక్టుపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సమంత దంపతులు హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని టాక్ వినవస్తోంది.
సమంత కీ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాకు రాజ్ నిడిమోరు కథను అందించి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ విజయం సమంత దంపతుల కెరీర్‌లో కొత్త చాప్టర్‌ను ప్రారంభింపజేసిందని, వారు గ్లోబల్ లెవెల్ ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. రాజ్ అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌తో తన ట్యాలెంట్ ఏంటో ఇప్పటికే చూపించాడు. సమంత కూడా గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న నటి.
ఈ దంపతుల కాంబినేషన్ హాలీవుడ్ ప్రాజెక్టు చేస్తే అదుర్స్ అనే అంచనాలు మొదలయ్యాయి. రాజ్‌కు హాలీవుడ్‌లో ఇప్పటికే బలమైన అనుబం ధం ఉంది. గ్లోబల్ స్పై యూ నివర్స్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ నుంచే ఆయన హాలీవుడ్ ఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయట. సమం త, రాజ్ తర్వాతి ప్రాజెక్టు హాలీవుడ్ స్కేల్‌లో ఉండబోతుందని, దీనికి రాజ్ నిడిమోరు డైరెక్టర్‌గా, సమంత ఒక ముఖ్య నిర్మాతగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజ్‌కు ఇంటర్నేషనల్ ప్రాజెక్టులను డీల్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సమంత కూడా ఓవైపు యాక్టింగ్ స్కిల్స్, మరోవైపు ప్రొడక్షన్‌పై పట్టుండటంతో.. ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగిపోతోంది. సమంత, రాజ్ నిడిమోరు చేయబోయే ఈ హాలీవుడ్ ప్రాజెక్టు వివరాలు, కాస్టింగ్, షూటింగ్ షెడ్యూల్ వంటి అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. వీరు తెరకెక్కించబోయే హాలీవుడ్ సినిమా ఎలా ఉండబోతోంది? ఇది కేవలం వెస్ట్రన్ సినిమాగానే ఉంటుందా..? లేక టాలీవుడ్, హాలీవుడ్ స్టార్లతో తెరకెక్కే మల్టీస్టారర్ కాబోతోందా..? అనే చర్చ జరుగుతోంది.






