28 August, 2026 | 3:46 PM

అన్నా చెల్లెళ్ల అనుబంధమే రక్షాబంధన్

28-08-2026 02:42 PM

ఘట్ కేసర్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల ప్రేమాభిమానాలకు చిహ్నమైన రాఖీపండగను ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం, ఎదులాబాద్, ఘట్ కేసర్ డివిజన్ ల ప్రాంత ప్రజలు శుక్రవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తరతరాలుగా సాంప్రదాయబద్దంగా వస్తున్న పండుగలలో శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకునే రక్షాబందన్ అతిముఖ్యమైనది. ఆడపడుచులు ఈపండగ రోజున పుట్టింటికి వచ్చి తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కడతారు. ఈసందర్బంగా పుట్టింటివారు తోచినవిధంగా కానుకలు సమర్పించుకుంటారు. రాఖీ పండగను పురస్కరించుకొని మహిళలు, యువతులు, బాలికలు ఉదయాన్నే దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారు. కుటుంబ విలువలు, ప్రేమాభిమానాలు  తగ్గుముఖం పడుతున్న ఈ రోజుల్లో నేనున్నానంటూ బంధం మరింత గట్టి పడేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఆత్మీయత, ఉత్సాహాన్ని నింపుతుంది రాఖీ.