28 August, 2026 | 3:39 PM

గణపురంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

28-08-2026 02:36 PM

గణపురం,ఆగస్టు 28 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపురం మండల కేంద్రంలో వేడుకలను శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు తమ సోదరులకు రాఖీలు కట్టి ప్రేమానురాగాలనుచాటుకున్నారుసోదరులు తమ సోదరీమణులకు రక్షణగా ఉంటామని హామీ ఇస్తూ ఆత్మీయంగా రాఖీలు కట్టించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోదర,సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని ప్రజలు ఆనందోత్సాహాలతోజరుపుకున్నారు.