మల్లాపూర్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
మల్లాపూర్,ఆగస్టు 28 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు(Rakhi Purnima celebrations) ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ 14వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డిలకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రక్షాబంధన్ అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, అదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధుల మధ్య సోదరభావం, ఐక్యతను చాటేందుకు రాఖీ కట్టినట్లు ఏనుగు లక్ష్మి తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌తో కలిసి పనిచేస్తున్న తామంతా ఒకే కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాఖీ కట్టిన వార్డు సభ్యురాలికి సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి పండుగ కానుకను అందజేశారు. గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వార్డు సభ్యులందరి సహకారంతో మల్లాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






