14 April, 2026 | 5:23 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

ఘనంగా సమ్మక్క సారక్క జాతర

30-01-2026 09:14 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని ఇటిక్యాల గ్రామంలోని గోదావరి తీరాన వెలసిన సమ్మక్క సారక్క గద్దల వద్ద కు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు తులాభారం బెల్లం (బంగారం) జోకి సమ్మక్క సారలమ్మలకు సమర్పించారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి భక్తులకు సహకరిస్తున్నారు. లక్షేట్టిపేట, దండేపల్లి, జన్నారం, మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సమ్మక్క సారక్క జాతర ఈ ప్రాంతంలో భక్తుల తో సందడి సంతరించుకుంది.