30-01-2026 09:16:30 PM
సిద్దిపేట: సిద్దిపేటలోని మార్కండేయ దేవాలయంలో 63వ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం సుప్రభాతం, ప్రణవ ధ్వజారోహణం, అఖండ జ్యోతి ప్రజ్వలనం, విఘ్నేశ్వర పూజ, పూర్ణ కలశ స్థాపన, స్వస్తి పుణ్యాహవాచనం, మార్కండేయ పూజ, రుద్రాభిషేకం తదితర పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన జరిగింది పూజా కార్యక్రమాలలో సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం పట్టణ కార్యవర్గం యువజన, మహిళా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.