calender_icon.png 12 July, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలకు 20 కోట్లు మంజూరు

12-07-2025 12:00:00 AM

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పంపిణీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో దేవాలయాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసిం ది. ప్రభుత్వం తరఫున 20 కోట్లు మంజూరైనట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. మంజూరైన 90 బోనాల చెక్కులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఇన్‌చార్జి అజారుద్దీన్, నవీన్ యాదవ్ శుక్రవారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాలు పండుగ ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.