calender_icon.png 12 July, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కు స్థలం చూపించి బ్యాంక్ లోన్

12-07-2025 12:00:00 AM

కుత్బుల్లాపూర్, జులై 11(విజయ క్రాంతి):  బ్యాంకు లోన్ కోసం ఓ బిల్డర్ పార్కు స్థలాన్ని తనఖా పెట్టిన సంఘటన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతి నగర్ లోని బాచుపల్లి గ్రామం సర్వే నెంబర్ 148,149 లోని సాయికృష్ణ కాలనీ లో సుమారు 1800 గజాలకు పైగా పంచాయితీ కాలం నుండి పార్క్ స్థలం ఉంది.

రెండు సంవత్సరాల క్రితం ఓ బిల్డర్ ఆ పార్కు స్థలం తనది అంటూ కొన్ని డాక్యుమెంట్స్ చూపించి కబ్జా చేసేందుకు పూనుకోగా స్థానికులు అడ్డుకుని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ ఫిర్యాదులు చేశారు.  తర్వాత ఇరు వర్గాలు పార్కు స్థలం పై కోర్ట్ కు వెళ్లాయి. పార్కు స్థలంగా ఉన్న వివాదాస్పద స్థలాన్ని తన ప్రాపర్టీ గా చూపించి సదరు బిల్డర్ విజయవాడ యూనియన్ బ్యాంక్ వద్ద మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్నాడు.

విజయవాడ యూనియన్ బ్రాంచ్ కు చెందిన బ్యాంకు అధికారులు శుక్రవారం సైట్ విజిట్ కు రావడం తో స్థానికులు అడ్డుకొని ఆందోళన చేశారు. పార్కు స్థలం కు లోన్ ఎలా ఇస్తారని,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని కూడా ఎవ్వరైనా మార్టిగేజ్ చేస్తే లోన్ ఇస్తారా అంటూ బ్యాంక్ అధికారులను స్థానికులు ప్రశ్నించారు.

మార్టిగేజ్ చేసి మా బ్రాంచ్‌లో లోన్ కోసం వచ్చారు.మార్టిగేజ్ చేసిన స్థలాన్ని చూసి వెళ్దామని వచ్చాము,అంతే కానీ మేము స్వాధీనం చేసుకోవడం లేదని విజయవాడ యూనియన్ బ్యాంకు మేనేజర్ సునీత బదులిచ్చారు.