లంచమిస్తే లైసెన్స్.. లేకుంటే సైలెన్స్!
గౌడ సంఘం లైసెన్సుల మంజూరులో అక్రమ వసూళ్లు
ఒక్కో లైసెన్సుకు రూ.2500 వసూలు చేస్తున్న ఏజెంట్ ?
ఎక్సైజ్ అధికారుల తీరుపై గౌడ కులస్తుల ఆగ్రహం
గరిడేపల్లి, ఆగస్టు 25: గీత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న లైసెన్సుల మంజూరిలో మండలంలోని పలు గ్రామాలలో లం చాల పర్వం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. గీత పనివారులను ఎక్సైజ్ శాఖ అధికారులు చెట్టు ఎక్కగలరా లేదా అనేది పరిశీలించిన తదుపరి వారికి లైసెన్సులను మంజూరు చేస్తారు.
అయితే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఎక్సైజ్ శాఖ అధికారులతో సన్నిహితంగా మెలుగుతూ లంచం ఇస్తేనే లైసెన్స్ మంజూరి అని గౌడ కులస్తులకు చెబుతూ వారి నుండి ఒక్కో లైసెన్స్ కు 2500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆ కులస్తుల ద్వా రా తెలుస్తుంది. అయితే వసూలు చేసిన ఆ నగదులో కొంతమేర అధికారులకు అందజేస్తూ మిగిలింది తానే నొక్కేస్తున్నాడు అనే ప్రచారం మండల వ్యాప్తంగా సాగుతుంది. మొత్తానికి గీత కార్మికులకు లంచం ఇస్తేనే లై సెన్స్.. లేకుంటే అంతా సైలెన్స్.. అనే ప్రచా రం సాగుతున్నట్టు తెలుస్తుంది.
ఒక్కో లైసెన్స్ కు రూ. 2500 వసూలు
గతంలో ఓ పేరుగాంచిన వ్యక్తి నిస్వార్థంతో పనిచేస్తూ అ ర్హులైన వారికి లైసెన్సులు ఇప్పిస్తుండగా సదరు ఏజెంట్ తనకు అను కూలంగా ఉన్నవారిని ఒక జట్టుగా ఏర్పాటు చేసుకొని వారి అండతో ఈ తంతు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అర్హులైన వారికి నేరుగా అందాల్సిన లైసెన్సులకు సదరు ఏజెంట్కు ఒక్కో లైసెన్సుకు రూ.2500 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గౌడ సంఘం లైసెన్సుల కోసం గతంలో ఎక్సైజ్ అధికారులు పరీక్షలు నిర్వహించారని, పరీక్షల అనంత రం అర్హత సాధించిన వారికి లై సెన్సును నేరుగా అందించే వారి ని, కానీ ప్రస్తుతం అలా చేయకుండా లైసెన్సులన్నింటినీ ఒక ఏజెంట్కు అప్పగించినట్లు పలువురు గౌడ సంఘ సభ్యులే ఆరో పిస్తున్నారు. సదరు ఏజెంట్ లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2500 చొప్పున వసూలు చేసి లైసెన్సులు అందజేస్తున్నట్లు ఆ కులస్తులే చెబుతుండడం గమనార్హం.
ప్రశ్నిస్తే అదనపు వసూలు :
ప్రభుత్వం అందించే లైసెన్సుకు డబ్బులు ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించిన వారికి రూ.3 వేలు తప్పనిసరిగా ఇవ్వాలనీ పై అధికారులకు మెయింటెన్ చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందేనంటూ ఆ ఏజెంట్ చెబుతున్న ట్లు పలువురు ఆరోపిస్తున్నారు. గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే విధంగా వసూళ్లు జరుగుతున్నాయని గౌడ కులస్తుల చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని కొందరు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. పైస్థాయి అధికారులకు కూడా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
లైసెన్సుల పంపిణీలో పారదర్శకత పాటించడంతో పాటు, లబ్ధిదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరి పి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని గౌడ సంఘ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పం దించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






