ఇసుక ఫిల్టర్..బేఫికర్
-గుమ్మడవెల్లి, బేగంపేట్ కేంద్రాలుగా తయారీ
-పోలీసులు దాడులు చేసి కూల్చివేసినా కొనసాగింపు
-తయారీదారులకు అధికారుల అండదండలు
-ఇందిరమ్మ లబ్ధిదారులకు దొరకని ఇసుక
కందుకూరు ఇసుక తయారీ కేంద్రాలకు అడ్డంగా మారింది. ప్రభుత్వ భూముల్లో తయారు చేస్తున్నారు. ఫిల్టర్ ఇసుక యంత్రాలను పోలీసులు మెరుపు దాడులు చేసి తొలగించి కేసులు నమోదు చేసినా మళ్లీ కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పూర్తిస్థాయిలో గండిపడుతోంది. ఇల్లు కట్టుకుందామంటే ప్రభుత్వపరంగా వచ్చే ఐదు లక్షలు సరిపోవడంలేదని, తక్కువ ధరకు ఇసుక తెచ్చుకుందామంటే కృత్రిమ ఇసుక వేసి డబ్బులు దండుకుంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
కందుకూరు, నవంబర్ 21 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని గుమ్మడవెల్లి, బేగంపేట్ గ్రామాలలో ఇసుక ప్రభుత్వ భూములు అడ్డాగా మారాయి. దీంతో ఫిల్టర్ ఇసుక తయారీ అక్రమ రవాణా చేసే కొందరు,అధికారుల అండదండలతో పూర్తిస్థాయిలో రాత్రి వేళల్లో మట్టిని తోడి ఆయిల్ ఇంజన్ల యంత్రాలతో మట్టిని ఫిల్టర్ చేసి ఇసుకను తయారు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను సైతం ప్రభుత్వం ఇవ్వడంతో దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో ఉన్న కాలువలలో చెరువుల పక్కన ఫిల్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మట్టిని తవ్వడమే కాకుండా సంబంధిత రెవెన్యూ,ఇరిగేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కు తాము దోచుకున్నంత దోచుకుంటాము తమరు చేసేంతవరకు చేయండి అన్న చందంగా ఇసుక ఫిల్టర్ అక్రమ చోదకులు పరిస్థితి మారింది.
వారిని రక్షించడమే కాకుండా ఇండ్ల నిర్మాణంలో ఇసుకను వాడటం వల్ల ఇల్లు పది కాలాలపాటు ఇండ్లు చిరస్థాయిగా ఉండవని పలువురు నిపుణులు తెలియజేస్తున్న పేద ప్రజలు మాత్రం తక్కువ ధరకు వస్తుందని ఫిల్టర్ ఇసుకను వాడుతున్నారు.దీన్ని అధునగా చేసుకున్న ఫిల్టర్ ఇసుక తయారుచేసే అక్రమార్కులు రాత్రివేళల్లో ఇసుకను తయారుచేసి ఉదయం 3 నుంచి నాలుగు గంటల లోపు నగరానికి భారీ స్థాయిలో ఇసుకను తరలిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న రెవెన్యూ సిబ్బందికి తెలిసిన మీన్నకుండి పోవడంలో ఆంతర్యం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి భారీ ఆదాయం గండి పడకుండా చూడాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో పాటు పోలీసు శాఖలకు పలువురు కోరుతున్నారు.
ఒక ట్రాక్టర్ రూ.7వేలు
ఇందిరమ్మ ఇళ్ళను బేస్ చేసుకొని అక్రమంగా కృత్రిమ ఇసుక ఫిల్టర్ తయారీ దారులు ఒక ట్రాక్టర్ కు సుమారుగా 7000 నుంచి 80 వేల వరకు వస్తువులు చేసి సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ పరంగా నిబంధనలు పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిబంధనలు ఉన్న ఇబ్బందులను తుంగలో తొక్కి ఇదేచ్ఛగా కృత్రిమ ఇసుకను తయారు చేసి విక్రయించే సొమ్ము చేసుకుంటున్నారు
ఇదేమిటని కొందరు వారిని ప్రశ్నిస్తే మీకు ఇష్టం వస్తే వేసుకోండి లేకుంటే వద్దు అనే విధంగా మాట్లాడుతున్నారని కొందరు లబ్ధిదారులు వాపోతున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా అధికారులు కానీ రాజకీయపరంగా ఎవరు ఆదుకోవడం లేదని లబ్ధిదారులు దినావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేసి వారికి అండగా ఉండాలని లబ్ధిదారులు కోరుతున్నారు
చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్
మండల పరిధిలో కృత్రిమంగా ఇసుక తయారు చేస్తే వారిపై చట్టారీత్యా పటేల్ చర్యలు తీసుకుంటామని కందుకూరు తాసిల్దార్ గోపాల్ హెచ్చరించారు. కృత్రిమ ఇసుక తయారు చేసే వారిపై అధికారులు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ‘విజయక్రాంతి’ఆయనను వివరణ కోరగా తాసిల్దార్ పై విధంగా స్పందించారు. ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ భూముల్లో పట్టా భూముల్లో ఇసుక తయారీ చేస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పట్టా భూముల్లో తీస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోని భూములను ప్రభుత్వానికి అప్పజెప్తామని ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఇసుకను ఉచితంగా గా పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని, దానికి అనుగుణంగా ఎవరైనా పంపిణి చేయకుండా వ్యతిరేకంగా పాల్పడితే వారిపై కూడా కఠిన తరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. తాసిల్దార్ గోపాల్‌ను ‘విజయ క్రాం తి’ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫోన్లో సంప్రదించగా ఇసుక ఫిల్టర్ ఎక్కడ నడుస్తున్నాయని అనడం కోసం మెరుపుగా ఉంది. విజయ క్రాంతి ప్రతినిధి కందుకూరు మండలంలో బేగంపేట్, గుమ్మడవెల్లి ప్రాంతాల్లో నడుస్తున్నాయని తెలపగా అలాంటి వారిపై చర్యలకు వెనుకాడబోమని పేర్కొన్నారు.






