15 April, 2026 | 8:23 AM

ముదిరాజులకు అధిక సీట్లను కేటాయించాలి

22-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలని ముదిరాజ్ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో ముదిరాజుల జెండా ఎగురవేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు పున్న రాజేశ్వర్ మాట్లాడుతూ, జనాభా ప్రాతిపాదికంగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆర్థికంగా ముదిరాజులు ఎదగాలని, స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జెలు బిక్షపతి మాట్లాడుతూ, ముదిరాజులకు అన్ని గ్రామాలలో  మత్స్యకార సహకార సంఘాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వాటిలో ముదిరాజులకు సభ్యత్వాలు కల్పించాలని  కోరారు. 

మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్ మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా బీసీలకు మేమెంతో మాకు అంత అనే విధంగా రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.   జంగంపల్లి ముదిరాజ్ అధ్యక్షులు సిద్దయ్య, రమేష్ తోపాటు పెద్ద ఎత్తున ముదిరాజులు పాల్గొన్నారు.