calender_icon.png 28 October, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో అక్రమార్కుల ఇసుక దందా..

28-10-2025 12:22:26 AM

ఇందిరమ్మ ఇండ్ల పథకం.. పేదల సొం తింటి కల.. ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోం ది. కానీ ఈ పథకం ఎర్రుపాలెం మండలంలో అక్రమార్కులకు ఒక వరం లాగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కు ఇచ్చే ఇసుక రవాణా మాటన అక్రమార్కు లు ఇసుక రేవులలో అక్రమ ఇసుక ర వాణా దందాకు తెర లేపారు.

ఇసుక రీచ్ లలో గుట్టల కొద్ది ఇసుకను డంపు చేసి రా త్రి వేళలో అక్రమ రవాణాకు తెర తీశా రు...ప్రభుత్వ అధికారుల చూసి చూడన ట్లు వ్యవహరించడంతో, నిఘా వ్యవస్థ ఉ దాసీన వైఖరితో మండలంలో వీరి ఇసుక వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయ లు... లాగా సాగుతోంది.. వీరి ఆగడాలతో ప్రభుత్వ ఖజానాకు వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు స్పందించి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపి, అక్రమ ఇసుక రవాణా దం దాను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు సొంత ఇంటి కలను నిజం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు..  

ఎర్రుపాలెం అక్టోబర్ 27 (విజయక్రాంతి): త ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తామని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా ప్ర భుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. మండలంలో పేదలను గుర్తించి వా రి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మండలంలోని 31 గ్రామాలలో సుమారు 500 మందికి ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేసింది. 

 లబ్ధిదారులకు ఉచిత ఇసుక రవాణా..

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభు త్వం ఉచిత కూపన్ల ను మంజూరు చేసి ఇసు క రేవుల నుండి ఇంటి నిర్మాణానికి కావలసిన ఇసుకను అందిస్తుంది. ఇసుక రవాణా కు అయ్యే ఖర్చును లభిదారుడే భరిస్తున్నా డు. లబ్ధిదారులు ప్రైవేటుగా ఇసుక కొనాలంటే మూడు నుండి నాలుగు వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగానే అందిస్తుంది.

ఉచిత ఇసుక రవాణా మటనా అక్రమ ఇసుక దందా.. 

లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక అందిస్తున్నప్పటికీ దీనిని ఆసరాగా చేసుకొని కొం తమంది అక్రమార్కులు అక్రమ ఇసుక రవాణాకు తెర లేపారు. అక్రమార్కులు ఇసుకరే వులలో అక్రమంగా ఇసుకను డంపు చేసి ప క్క ఉన్న మండలాలకు, ఇతర రాష్ట్రాలకు అ క్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ ఇ సుక 5 వేల నుండి ఆరు వేల వరకు బయట అమ్ముతున్నారు. దీనివల్ల లక్షాధి రూపాయ లు ప్రభుత్వ ఖజానాకు రావలసిన ఆదా యం అక్రమార్కుల జేబులోకి వెళుతోంది. 

ఇసుక రవాణాను అరికట్టాలి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభు త్వం అందిస్తున్న ఉచిత ఇసుక మాటున అక్రమార్కుల ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా కొనసాగుతోందని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అక్రమ ఇసుక తరలించకపోయే వారిని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిఘా వ్యవస్థను మరింత పటిష్టవంతంగా అమలు చేసి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మండలంలో అక్రమ ఇసుక దందాను అరికట్టాలి.. 

 ఇందిరమ్మ ఇండ్ల కు రవాణా చేసే ఇసు క రవాణా మా టున కొంతమంది అక్రమార్కులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమార్కుల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అక్రమ ఇసుక దందాను అరికట్టాలి.

దివ్వెల వీరయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు