calender_icon.png 28 October, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఉద్దాల మహోత్సవానికి సర్వం సిద్ధం

28-10-2025 12:53:43 AM

  1. లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం

650 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు 

ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట, అక్టోబర్ 27 : శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయింది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్ర తిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామి ఉద్ధాల వేడుకలు మండలంలోని వడ్డేమాన్ గ్రామం నుంచి ప్రారంభమవుతాయి. సంస్థానాధిశుల కాలం నుంచి సంప్రదాయబద్ధంగా గ్రా మంలోని ఉద్దాల కర్మాగారం లో అమావా స్య రోజు రాత్రి గంగా పూజ అనంతరం స్వా మివారి పాదుకల తయారీ మొదలవుతుం ది.

ఉద్దాల మండపంలో పరిచిన ఊక చెట్టు వాగు ఇసుకపై అర్ధరాత్రి దాటిన అనంతరం కురుమూర్తి స్వామి, పద్మావతి దేవి ల పా దాల గుర్తుల ఆధారంగా పాదుకల తయారీ ప్రారంభమవుతుందని పల్లె ప్రజల్లో చారిత్రక కథనం ఉంది. పద్మావతి సమేతంగా కు బేరుని అప్పు తీర్చలేక తిరుమలగిరి కృష్ణానది తీరం చేరిన శ్రీ వెంకటేశ్వరుడు కృష్ణ న దిలో సేద తీరిన అనంతరం స్వామివారి పాదాలు కందిపోకుండా కృష్ణవేణి పాదుక లు బహుకరించిందని ఆ పాదుకులనే ఉద్ధాల ఉత్సవంలో ఊరేగిస్తారని పె ద్దలు చెబుతున్న మాట.

నాడు శ్రీ వెంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణా నదిలో జలకమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు పట్టణానికి సమీపంలో గుండాల జలాశయంగా ప్ర సిద్ధి చెందిందని సంస్థానా దిశుల కాలం నా టి చారిత్రక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. వడ్డేమాన్ గ్రామంలో రాయలసీమ ప్రాంతం నుంచి సమకూర్చుకున్న ఆవు చర్మంతో చర్మకారులు వారం రోజులపాటు శ్రమించి స్వా మి వారి పాదుకులను తయారు చేస్తారు. పాదుకల తయారీ సందర్భంగా చర్మకారులు ఏడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఉద్దాల క ర్మాగారంలోని నివాసం ఉంటారు.

ఉద్దాల ఉత్సవ రోజున స్వామివారి పాదుకులను ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉద్దాల ఊరేగింపు సందర్భంగా దాదాపు 3 గంటల పాటు ఊక చెట్టు వాగులో తిరునాళ్లు జరుగుతాయి. గ్రా మానికి చెందిన నెల్లి వంశస్థులు మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో బాణాసంచా పేలుళ్ల మధ్య స్వామి వారి పాదుకుల ను పూజలు నిర్వహిస్తారు. శ్రీ ఆంజనేయ స్వా మి దేవాలయం చేరుతుంది. లక్ష్మీదేవి పాదరక్షలు తలపై ఉంచి స్వామివారి పాదరక్షల ను మోచేతులు ఆధారంగా తిరుమలపు రం చేరుస్తారు. 

పూజలు అనంతరం స్వామివారి పాదుకలను వేలాదిమంది భక్తుల వెం ట రాగా అం దంగా అలంకరించిన ట్రాక్టర్ పై పాదుకుల ఉంచి కురుమూర్తి దేవస్థానం చే రుస్తారు. ఉద్దాల ఉత్సవం పూర్తయిన ప్రత్యే క ఆహ్వానితులు, దేవస్థానం పాలకవర్గం, అ ధికారు లు, అనధికారులు ఉద్దాల ఊరేగింపు స్వాగ తం పలికి పూజలు నిర్వహిస్తారు. భక్తు ల గోవిందా నామస్మరణ మధ్య స్వామి వా రి పాదుకులను కాంచన గుహలోని వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి సన్నిధికి చేర్చి అనంతరం ఉద్దాల మండపంలో ఉంచుతారు.. ఇ క్కడ దళితులు పూజలు నిర్వహిస్తారు. 

650 మంది పోలీసులతో బందోబస్తు..

నేడు జరగనున్న ఉద్దాల మహోత్సవానికి 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. సోమవారం జాతరలోని పోలీస్ అవుట్ పో స్టింగ్‌లో బందోబస్తు నిర్వహించే పోలీసుల తో సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు లు అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపా రు. ఉద్దాల ఉత్సవం ప్రశాంతంగా జరిగే లా పోలీసులు సమన్వయంతో పని చేయాలని ఆమె తెలిపారు.

జాతరలో సీసీ కెమెరాల ని ఘా ఉంటుందని ఆమె తెలిపారు. ఉద్దాల ఉ త్సవానికి బందోబస్తుగా 6 మంది డిఎస్పీ లు, సిఐలు 12 మంది ఎస్‌ఐలు, 45 మంది మిగతా పోలీసులు పాల్గొంటారని ఆమె తెలిపారు. పాలకవర్గానికి అధికారం గానికి ఎప్ప టికప్పుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశిస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. 

జాతరలో నిరంతరం వైద్య సేవలు

శ్రీ కురుమూర్తి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వైద్యాధికారి శిరీష తెలిపారు. జాతరలో మూడు వైద్య శిబిరాలను ఏర్పా టు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ శిబిరాలలో 11 మంది వైద్యులు అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు.