18 April, 2026 | 10:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా

14-05-2025 01:10 AM

సీఎస్ రమకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్‌కుమార్ సుల్తానియాను నియమించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్ కే రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.

ఈ సందర్భంగా సుల్తానియా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సుల్తానియాకు డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు తెలిపారు. 1998 బ్యాచ్‌కు చెందిన సందీప్‌కుమార్ సుల్తానియా బిహార్ రాష్ట్రానికి చెందినవారు. చార్టర్డ్ అకౌంటెంట్ గ్రా డ్యుయేట్. తొలుత తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.

అనంతరం సీఎం కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆర్థిక, రవాణా, సహకార సంస్థలు, పర్యాటక రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, భూ రెవెన్యూ నిర్వహణ, పట్టణాభివృద్ధిలో అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన తాజాగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.