14-05-2025 01:09:48 AM
నారాయణపేట. మే 13( విజయ క్రాంతి) : నారాయణ పేట జిల్లా కేంద్రంలోని సింగారం మలుపు దారి వద్ద రూ. 56 కోట్ల వ్యయం తో నిర్మిస్తున నూతన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ భవన నిర్మాణ పనులలో వేగం పెంచాలన్నారు.
కలెక్టరేట్ భవన నిర్మాణ మ్యాప్ ను చూశారు. మ్యాప్ ప్రకారం ఇప్పటి వరకు ఏ పనులు ఏ ఏ దశల్లో కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా మరో 6 నెలలలోపు కలెక్టరేట్ పనులు పూర్తి కావాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజేందర్, డీ ఈ రాములు, ఏఈ లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.