28 May, 2026 | 2:54 AM

సందిగ్ధం సక్సెస్ కావాలి

28-05-2026 01:11 AM

సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారథి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సందిగ్ధం’. ఈ సినిమాలో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ సీహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్‌లో ‘తెరచేప’ ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ సినిమా మే 29న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సందిగ్ధం’ టైటిల్ చాలా బాగుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. చిత్ర దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ.. “చిన్న సినిమాల్ని తీయడం కంటే ప్రమోట్ చేయడం, రిలీజ్ చేయడం చాలా కష్టం. మా చిత్రం అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది” అని తెలిపారు. నటీనటులు నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, కాజల్ తివారి, అర్జున్ సీహెచ్, ఆనంద్, నవీన్‌రాజ్, నాగిరెడ్డి, చిట్టిబాబు, గడ్డం నవీన్, ఎడిటర్ విశ్వన్ రాజ్ తదితర చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.