శర్వా సరసన ?
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన అందం, అభినయంంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎక్కువగా సీనియర్ స్టార్స్ సరసన జోడీ కట్టింది. ఇప్పుడు తొలిసారి యంగ్ స్టార్ శర్వానంద్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. దర్శకుడు శ్రీనువైట్ల ఈ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెం ట్‌కు విభిన్నమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టును జోడించి ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ఆషికా మెయిన్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమాలో శర్వా సరసన జోడీగా నటించే లక్కీ హీరోయిన్ ఎవరనే విషయమై చాలా మంది పేర్లు వినిపిం చాయి. తాజాగా టీమ్ ఆషికాను ఫైనల్ చేసినట్టు తెలు స్తోంది. ఇందులో ఆషికా క్యారెక్టర్ చాలా ఫన్నీగా, కథ ను నడిపించే పవర్‌ఫుల్ పాత్రగా ఉండబోతోందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే జూలై నెల నుంచి ప్రారంభం కానుందని టాక్.






