అర్చకులకు పెన్షన్, హెల్త్ కార్డులను ఇవ్వాలి
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులకు హెల్త్ కార్డులను మరియు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ అన్నారు. శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో నూతన ఇంచార్జి కమీషనర్ గా నియామకం అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్యర్ ను మర్యాదపూర్వకంగా కలిసి దేవాదాయ శాఖలో పని చేస్తున్న అర్చక ఉద్యోగుల కు పెన్షన్, హెల్త్ కార్డు ఇవ్వాలని, అదేవిధంగా అర్చక ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానన్నారు. అదేవిధంగా భక్తులకు దేవాదాయ శాఖ నుంచి అనేక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి. ఆర్ శర్మ కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.






