15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఆర్మూర్‌లో శానిటేషన్ డే

28-06-2025 12:29 AM

అర్మూర్, జూన్ 27 (విజయ క్రాంతి) : ఫ్రైడే -డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని వార్డులో శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఇంటి పరిసరాల శుభ్రత కోసం- మన ఆరోగ్యం కోసం వారములో ఒక రోజు కార్యక్రమములో భాగంగా ఆర్మూర్ పట్టణములోని రెండవ వార్డులో న్యాయవాది,  మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఖాందేష్  విన్నపం మేరకు ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

నిలువ వున్న నీరు ద్వారా దోమలు ఏవిదంగా పెరుగుతాయో తెలిపి, పలు చోట్ల నిలువ వున్న వృధానీటిని పారవేయడం జరిగింది. ఇంటి పరిసరాలలో వృధా నీరు నిలువ వుంచవద్దని కోరారు. లార్వ ఏర్పాటు కాకుండా థామోపాస్ లిక్విడ్ ను నిలువ వున్న నీటిలో వేసినారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం,  వైద్యఆరోగ్య శాఖా అధికారులు సాయి, హెల్త్ అసిస్టెంట్లు ఆనంద్, శ్యామల, ఆశ వర్కర్ స్వప్న,  నరేందర్, వార్డు ఆఫిసర్ చక్రధర్  పాల్గొన్నారు.