17 April, 2026 | 10:13 AM

రంగంలో దిగిన శానిటేషన్ సిబ్బంది

29-05-2025 01:55 AM

కరీంనగర్, మే28(విజయక్రాంతి): ‘దహన సంస్కారాలకు  దారేదీ’ శీర్షికతో బుధవారం విజయక్రాంతిలోప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం కరీంనగర్ నగర పాలక సంస్థలో విలీనమైన దురషెడ్ డివిజన్లో శానిటేషన్ స్పెషల్ ఆఫీసర్ వెటర్నరీ డాక్టర్ దుర్గాప్రసాద్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ మణిదీప్ స్మశాన వాటిక మరియు డ్రైనేజీలు పరిశీలించడం జరిగింది.

స్మశాన వాటికలో  గడ్డిని తొలగించారు. శానిటేషన్ సిబ్బంది తో మరియు పైప్ లైన్ లో డామేజ్ విద్యుత్ దీపాల గురించి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి రిపేరు చేస్తామన్నారు.