నేడు కరీంనగర్‌కు బండి సంజయ్
కరీంనగర్, జూన్ 18 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం కరీంనగర్ రానున్నారు. కేంద్ర మ్రంతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కరీంనగర్ వస్తున్న బండికి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉద యం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని శనిగరం వద్ద బండికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. వారితో కలిసి బండి కరీంనగర్ చేరుకుని నేరుగా మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొంటారు. అనం తరం చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా కొండగట్టు వెళ్తారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చొప్పదండి నియోజకవర్గ శ్రేణుల తో మాట్లాడుతారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయానికి వెళ్తారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. సాయంత్రం 7 గంటలకు సిరిసిల్లకు వెళ్తారు. అక్కడినుంచి నేరుగా కరీంనగర్‌కు వస్తారు.






