ఎమ్మెల్యే పదవికి సంజయ్ రాజీనామా చేయాలి
- బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్
సంజయ్ దిష్టిబొమ్మల దహనం
జగిత్యాలలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
కరీంనగర్/జగిత్యాల/రాజన్న సిరిసిల్ల, జూన్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. సోమ వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే కలకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశర్, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత ఆధర్యంలో సంజయ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ఇంటిని ముట్టడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకున్నా కలకుంట్ల కవిత సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారని వెల్లడించారు. నీచమైన రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు జిల్లాలోని మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కన్న తల్లిలాంటి బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్యే సంజ య్ వెన్నుపోటు పొడిచారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్, కార్పొరేటర్ వా ల రమణారావు, నాయకులు షౌకత్ అలీ, గ డ్డం ప్రశాంత్ రెడ్డి, వొడ్నాల రాజు, నహీమ్, మాజిద్, దూలం సంపత్‌గౌడ్, చుక్క శ్రీనివాస్, తదితరులు నిరసన తెలిపారు.






