calender_icon.png 11 January, 2026 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

10-01-2026 01:26:48 AM

17 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): పాఠశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు మొదలవ్వనున్నాయి. ఈ నెల 10 నుంచి 16 వరకు విద్యాశాఖ ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. 17 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. లెక్కప్రకారం ఏడు రోజులు సెలవులున్నా 17న శనివారం, 18న ఆదివారం కావడంతో చాలా మంది విద్యార్థులు తిరిగి బడులకు 19 నుంచి అంటే సోమవారం నుంచి వెళ్లే అవకాశముంటుంది.