calender_icon.png 14 January, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపయ్యపల్లెలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహణ

13-01-2026 10:22:29 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సర్పంచ్ చెన్నవేని పరుశురాములు, ఉప సర్పంచ్ గోగు అనిల్, పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజేతలుగా మొదటి బహుమతి గంభీరావుపేట శిరీష రాజుకు మిక్సర్ గ్రైండర్, రెండవ బహుమతి బొజ్జ తేజ (తండ్రి లింగయ్య)కు నాన్‌స్టిక్ పాన్ సెట్టు అందించారు. ముఖ్యఅతిథిగా ఇరిగేషన్ ఏఈ సాగర్ పాల్గొని విజేతలను ఎంపిక చేశారు.