16 April, 2026 | 11:05 AM

అల్ఫోర్స్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

06-01-2026 12:09 AM

కొత్తపల్లి, జనవరి 5 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో  పాఠశాలలో ‘ఆల్ఫోర్స్ పల్లె వైభవం‘  పేరుతో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పండగకు ప్రధాన ఆకర్షణీయమైన ముగ్గులను చాలా అందంగా వేయడం ద్వారా గృహాలకు శోభతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్పారు. పండుగలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదని, పండుగల వైభవాన్ని తెలుసుకొని ఉత్సవాలలో పాల్గొని ఆనందంగా జీవితాన్ని గడపాలని సూచించారు.  ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.