calender_icon.png 9 January, 2026 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు సేవలను ఉపయోగించుకోండి

06-01-2026 12:10:15 AM

బ్యాంకు వారి కళాజాత 

గోపాలపేట, జనవరి 5: గ్రామ ప్రజలు గ్రామీణ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవాలని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ వారు అన్నారు. గ్రామీణ బ్యాంక్ గోపాలపేట ఆధ్వర్యంలో సోమవారం గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామంలోని గ్రామపంచాయతీ ముందు కళాజాత ప్రదర్శించారు. ఈ కళాజాత ఆటపాటలతో బ్యాంకులు యొక్క ఉపయోగాలను వివరించారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఖాతా ఓపెన్ చేసుకోవాలని తెలిపారు.

జీవిత బీమా పాలసీ అకౌంట్స్ గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకు శాఖలో ప్రతి ఒక్కరూ అకౌంట్ తెరవాలని చెప్పారు. ఇందులో మన జీవితానికి సంబంధించి పాలసీలు ఉన్నాయని బ్యాంకు సిబ్బంది ఆటపాటలతో తెలియజేశారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ లోకా రెడ్డి ఉప సర్పంచ్ రామకృష్ణ పాల్గొని బ్యాంకు యొక్క ఉపయోగం గురించి సర్పంచ్ మాట్లాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బ్యాంకు సిబ్బంది మహిళా సంఘాల నుంచి బుక్ కీపర్ తదితరులు పాల్గొన్నారు.