15-01-2026 12:19:41 AM
మహబూబాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): సంక్రాంతి వేడుకలు ఉమ్మడి వరం గల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉత్సాహం గా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునుండే జిల్లా వ్యాప్తంగా భోగి మంటలు వేశారు. అలాగే మహిళలు ఇండ్ల ముందు అందమైన రంగవల్లులు వేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు ముగ్గుల పోటీలో నిర్వహించారు. హరిదాసుల సంకీర్తనలు, డూ డూ బసవన్న లు సందడి చేశాయి. భోగి పండుగ సందర్భంగా పిల్లలకు పలుచోట్ల భోగి పళ్ళు పోశా రు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కేసముద్రంలో నిర్వహించిన గోదార రంగనాదుల కళ్యాణ వేడు కల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పాల్గొన్నారు.