15-01-2026 12:19:02 AM
ముగ్గులతో పోటీ పడుతున్న మహిళలు
జహీరాబాద్ జనవరి 14 : జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు ప్రయాణమై వస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి పం డుగను ఇంటి ముందు రంగవల్లులు వేసుకునేందుకు మహిళలు, యువతులు పోటీప డుతున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్, మొగుడం పల్లి, కోహీర్, జహీరాబాద్ మండలాల్లో సం క్రాంతి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఉత్సవా లకు వివిధ గ్రామాలలో ముగ్గుల పోటీలను నిర్వహించి యువజన సంఘాలు కార్మిక సంఘాలతో పాటు ఎన్జీవోలు ముగ్గుల పో టీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేస్తారు. ఈ పండగ ఆఖరి రోజు కనుమ జరుపుకునేందుకు విందులు వినోదాలు నిర్వహించుకుంటారు.