05-01-2026 12:46:19 AM
కేసముద్రం, జనవరి 4 (విజయక్రాంతి): దూరదర్శన్ యాదగిరి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మస్తు మజా కార్యక్రమం నిర్వహణలో భాగంగా ముందస్తు సంక్రాంతి వేడుకల షూటింగ్ జరిగింది. మస్తు మజా ప్రోగ్రాం నిర్మాత ముండుకూర్ గీత ఆధ్వర్యంలో కేసముద్రం మహిళలు ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందమైన రంగవల్లులు, గంగిరెద్దులు ఆటలు, హరిదాసుల కీర్తనలతో ముందస్తు సంక్రాంతిని తలపించింది.
మహిళల మధ్య కుస్తీ మస్తీ, కాళ్లకు కడియాలు ఇంకా డాన్సులలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దూరదర్శన్ యాదగిరి లో ప్రసారమవుతున్న మస్తు మజా కార్యక్రమం 71 వ ఎపిసోడ్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని తెలంగాణలోని అన్ని ప్రాంతాల మహిళల అభిమానాన్ని చూరగొంటుందని వివాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ అసిస్టెంట్లు జి శ్రీనివాస్, కుమారి, ఆడియో బి. కృష్ణమూర్తి, కే మునిరాజ్ కెమెరా బి.రవీంద్ర, ఏ కుమారస్వామి, ఎండి అహ్మద్ యాదయ్య, ఎస్. రాజేంద్రప్రసాద్, యాంకర్: శైలేష్, ప్రోగ్రాం లోకల్ కన్వీనర్ లక్కాకుల అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.