calender_icon.png 9 January, 2026 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత కొత్త భేదాల్లేకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

05-01-2026 12:44:44 AM

డీసీసీ అధ్యక్షురాలు ఉమ మురళి నాయక్ 

మహబూబాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పటిష్టత లక్ష్యంగా, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పాత కొత్త భేదాలు లేకుండా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ ఉమ మురళి నాయక్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం దుర్గేష్ డీసీసీ అధ్యక్షురాలు ఉమను శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ జడ్పిటిసి కదిరే సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు, కనుకల రాంబాబు పాల్గొన్నారు.