calender_icon.png 10 August, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

09-08-2025 05:20:49 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు నివాసము వద్ద యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ గారి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్సూర్ మాట్లాడుతూ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పిసిసి మహేష్ కుమార్ గౌడ్ యువజన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టారన్నారు అంతే కాకుండా గత యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శివసేన రెడ్డి , ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వెంకట్ బల్మూరి ,అనిల్ కుమార్ యాదవ్  ఉన్నత పదవీలలో ఉన్నారని వారు పేర్కొన్నారు.

యువజన కాంగ్రెస్ యువకుల బలోపేతానికి పనిచేయడమే లక్ష్యంగా వారికి ఉన్నత పదవులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య నేత యువ నాయకులు బాన్సువాడ మున్సిపాల్ మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ , మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు జిల్లా ఉప అధ్యక్షులు అలిబిన్ అబ్దుల్లా , కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేక్ , అధికార ప్రతినిధి గుడాల నగేష్ , బాన్సువాడ పట్టణ మైనారిటీ అధ్యక్షులు అఫ్రోజ్ , పాక్స్ డైరెక్టర్ రేంజర్ల సాయిలు, మైనారిటీ నాయకులు అజీమ్, కొట్టంల గంగాధర్,మాజీ వార్డ్ సభ్యులు గంగాధర్ , ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు భాను పటేల్ , అర్జున్ , యువ నాయకులు గౌస్ , ఇలియాస్ , రఫత్ , అతిక్ , రాములు తదితర నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.