2 April, 2026 | 2:57 PM

Breaking News

పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •  

పాపన్న ఆశయ సాధన కోసం కృషిచేద్దాం

02-04-2026 01:07 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా మహబూబ్ నగరంలోని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాత్ర అత్యంత విశిష్టమైందని పేర్కొన్నారు. నాటి దొరల అరాచకాలు, మొగలాయుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని సామాన్య ప్రజల హక్కులను కాపాడిన గొప్ప యోధుడు ఆయన అని కొనియాడారు. పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతమన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమని పేర్కొంటూ, రాష్ట్రంలో అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ పాఠశాలలను పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, నాయకులు మైత్రి యాదయ్య, తెలుగు గూడెం ఆంజనేయులు, గ్యాస్ అంజి, బీసీ సంక్షేమ అధికారి ఇందిరతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.