18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి

03-04-2025 12:34 AM

కలెక్టర్ బీఎం సంతోష్

గద్వాల, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) :బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని అన్నారు.

బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగల్ లు శిస్తుల రూపంలో పన్నుల వసూల్ల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో ప్రజలకు అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సి సంక్షేమ శాఖ అధికారిని సరోజ, వివిధ శాఖల అధికారులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.