17-09-2025 02:12:18 AM
కరీంనగర్, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): రాచ బాటల కు మార్గం సుగమమయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎన్నో ఏళ్ల ప్రజల వాంఛ తీరనుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గన్నేరువరం -కొత్తపల్లి, వేములవాడ- సిరికొండ, ఆర్నకొండ - మల్యాల ప్రాజె క్టులకు ఆమోదం లభించింది.
గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ అయిన మానేరు నదిపై హైలెవెల్ వంతెనను నిర్మించేందుకు కేంద్రమంత్రి కేంద్రాన్ని ఒప్పించి రూ.77 కోట్ల రూ పాయల నిధులు మంజూరు చేయించారు. అలాగే చొప్పదం డి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుండి మల్యాల క్రాస్ రోడ్డు వరకు డబుల్ లేన్ విస్తరణ పనుల కోసం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయించారు.
దీంతోపాటు వేములవాడ నుండి సిరికొండ వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.23 కోట్ల నిధులకు ఆమోద ముద్ర వేయించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 412.36 కి.మీల మేరకు 34 ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రూ.868 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, ర వాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆ నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ర హదారుల మౌలిక సదుపాయల నిధి(సీఆర్‌ఐఎఫ్ కింద తెలంగాణకు మంజూరైన మొత్తం రూ.868 కోట్ల నిధుల్లో ఏకంగా రూ.150 కోట్లు ఒక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికే కేటాయించడం విశేషం. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ గన్నేరువరం -కొత్తపల్లి వరకు మానేరుపై హైలెవల్ వం తెన నిర్మాణంతోపాటు,
వేములవాడ- సిరికొండ, ఆర్నకొండ మల్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, ఆ శాఖ ఉన్నతా ధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని, రాజకీయాలకు తావులేకుండా పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి అన్ని పార్టీల నేతలను కలుపుకుపోతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు కేంద్రమం త్రి బండి సంజయ్ కుమార్‌కు కృతజ్ఞతలుతెలిపారు.