ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
04-05-2026 04:44 PM
సర్పంచ్ బెండారే కృష్ణాజి
వాంకిడి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు త్వరితరగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని, బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. సోమవారం గ్రామం పంచాయతీ కార్యదర్శి దుర్గం ధర్మయ్యతో కలిసి బంబార గ్రామం తేలివాడలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారు లతో మాట్లాడి ఇంటి నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడి సంతోష్, గ్రామ సెక్రటరీ దుర్గం ధర్మయ్య, వార్డు సభ్యులు లోహబడే ఉమేష్, డొకే బండు తదితరులు పాల్గొన్నారు.






